సీఎం జగన్ తో జూ ఎన్టీఆర్ భేటీ..!! చిరంజీవితో పాటు నాగ్ -మహేష్ : అసలు వ్యహం ఇదేనా..!!
ఏపీలో అరుదైన సన్నివేశం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులతో సీఎం జగన్ సమావేశం ఫిక్స్ అయింది. ఈ సమావేశం సినీ అంశాలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది.
గత నెలలో జరిగిన సమావేశానికి చిరంజీవిని మాత్రమే ఏపీ సీఎం జగన్ ఆహ్వానించారు. లంచ్ మీట్ లో పలు అంశాల పైన చర్చించారు. ఆ సమయంలో సీఎం జగన్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని...ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక రాగానే మరోసారి చర్చలు ఉంటాయని చిరంజీవి స్పష్టం చేసారు. ఇక, ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సిద్దం అయింది.

సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు పైన టాలీవుడ్ నుంచి పలువురు స్పందించారు. తెలంగాణలో పెంచిన విధంగా ఏపీలోనూ టిక్కెట్ల ధరలు పెంచాలని డిమాండ్ చేసారు. దీని పైన హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి మంత్రి పేర్ని నాని అధ్యక్షతన ఓ కమిటీని వేసింది. టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ సినీ పరిశ్రమకు చెందినవారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో మంత్రి నాని ఈ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు న్యాయస్థానంలో వ్యాజ్యం విచారణ, మరోవైపు చిరంజీవి బృందంతో భేటీ నేపథ్యంలో.. సినిమా టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ గురువారం స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

చిరంజీవి టీంలో తారక్ - మహేష్
ఈ ప్రకటన వేళ.. సినీ ప్రముఖులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పేర్ని నాని నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సుల్లో బీ, సీ కేంద్రాల్లో సినిమా టికెట్ల ధరలు కనీసం రూ.40 నుంచి రూ.45 వరకు పెంచాలని సూచించినట్లుగా సమాచారం. ఇక, సీఎంతో జరిగే భేటీకి చిరంజీవి నాయకత్వం లో వచ్చే టీంలో హాజరు కాబోతున్న ప్రముఖుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. హీరోలు నాగార్జున, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు నిర్మాతలు దానయ్య, వంశీ కూడా ఈ భేటీకి హాజరవుతారని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్...రాధే శ్యామ్ నిర్మాతలు భారీ ఖర్చుతో సినిమాలు నిర్మించారు. పాన్ ఇండియా మూవీలు కావటంతో పాటుగా.. ఏపీ మార్కెట్ కీలకం కానుంది. దీంతో..సీఎం జగన్ తో వారు చర్చించే సమయంలో జూ ఎన్టీఆర్ సైతం వచ్చేందుకు సిద్దమయ్యారని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం.

సినీ అంశాలు.. రాజకీయంగానూ వ్యూహాలు
ఈ మేరకు ఇప్పటికే సీఎంఓకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. జూ ఎన్టీఆర్..మహేష్ బాబు ను సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చే బాధ్యతను చిరంజీవి - నాగార్జున తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఇది సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపైనే చర్చలకు వేదిక అయినా.. ఈ ఎంపిక వెనుక రాజకీయ వ్యూహం సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది.
జూ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు ఇప్పటికే డేట్ సైతం అనౌన్స్ చేసారు. ఇక, జూ ఎన్టీఆర్ ను చర్చల్లో ఉండేలా చూడటం.. సీఎంతో సమావేశం కావటం ... ఆయన సూచనలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ పేరు విజయవాడ జిల్లాకు ప్రకటించి..టీడీపీని సీఎం జగన్ కొంత మేర ఆత్మరక్షణలో పడేసారు.

ఒకే సమావేశం.. అందరికీ సమాధానం
ఇక, జూ ఎన్టీఆర్ తో సత్సంబంధాల ద్వారా.. టీడీపీలో ఆయన రాకను కోరుకుంటుండటం.. అధినాయకత్వం సానుకూలంగా స్పందించని ఈ సమయంలో వ్యూహాత్మకంగానే జూ ఎన్టీఆర్ సైతం చిరంజీవి టీంలో సీఎంతో భేటీ అయ్యే విధంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మహేష్ బాబు సైతం గతంలో పలుమార్లు వైఎస్సార్ కుటుంబం.. సీఎం జగన్ పైన అభిమానం చాటుకున్నారు.
దీంతో..పాటుగా చిరంజీవి - జగన్ తో జరిగిన సమావేశం పర్సనల్ అంటూ మంచు విష్ణు వ్యాఖ్యలు చేసారు. ఘట్టమనేని - మంచు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీని కారణంగా మహేష్ ను సైతం ఈ భేటీకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సానుకూల ప్రకటన దిశగా సీఎం జగన్..!
ఇక, ప్రముఖ నిర్మాతలు దానయ్య, వంశీ తో పాటుగా దిల్ రాజు కూడా రానున్నట్లు తెలుస్తోంది. దీంతో... వీరందరూ సీఎం జగన్ తో సమావేశం సమయంలో చేసిన ప్రతిపానదలకు సీఎం సైతం అంగీకరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక అడుగు ద్వారా సినీ పరిశ్రమలోపలా.. పరిశ్రమ అంశాలతో విమర్శించిన రాజకీయ నేతలకు ఈ భేటీ ద్వారా క్లారిటీ ఇస్తూ..ఇండస్ట్రీ మద్దతు దక్కేలా సీఎం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.
దీంతో...గురువారం సీఎం జగన్ తో జరిగే సినీ భేటీలో చివరకు ఎవరెవరు వస్తారు.. ఏం జరగబోతుందనే అంశం పైన అటు సినీ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications