కృష్ణా పుష్కరాలు: ఎన్టీఆర్‌కు చంద్రబాబు ప్రభుత్వ ఆహ్వానం (ఫోటోలు)
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని సినీ నటుడు ఎన్టీఆర్‌కు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వం తరుపున మంత్రి పల్లె ఎన్టీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిసి స్వయంగా కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.
ఈ మేరకు గురువారం ఉదయం గుంటూరు జిల్లాలోని సీతానగరం చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్న సీఎం పుష్కర ఆహ్వాన పత్రికను చినజీయర్‌కు అందజేశారు. అనంతరం ఆశ్రమంలో జరిగిన ప్రత్యేక పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు నారాయణ, పుల్లారావు, పరిటాల సునీత పూజలో పాల్గొన్నారు.
అనంతరం కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పాటల సీడీని చంద్రబాబుకు చినజీయర్ అందజేశారు. అనంతరం విజయవాడలోని పుష్కరఘాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పుష్కరాలను జయప్రదం చేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పుష్కరాల సందర్భంగా శుక్రవారం నుంచి 12 రోజుల పాటు సెమినార్‌లు ఉంటాయని ఆయన అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులను అలరించేందుకు గాను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని హీరో ఎన్టీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని హీరో వెంకటేశ్‌కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. పక్కనే చిత్రంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని హీరో మోహన్ బాబుకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. పక్కనే చిత్రంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని హీరో శ్రీకాంత్‌కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని తెలుగు నటుడు శివాజీ రాజాకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. పక్కనే చిత్రంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని టీవీ 9 రవి ప్రకాశ్‌కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని సీపీఐ నేత నారాయణకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి. పక్కనే చిత్రంలో మరో నేత రామకృష్ణ.

కృష్ణా పుష్కరాలు: ప్రముఖులకు ఆహ్వానాలు
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని సీపీఎం నేత చాడ వెంకటరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications