వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ మద్దతుతో ఇక బీజేపీ : చంద్రబాబు -పవన్ తో అందుకే : కొడాలి నాని సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేంద్ర మంత్రి అమిత్ షా.. హీరో జూ ఎన్టీఆర్ భేటీ పైన మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా నచ్చి..ప్రశంసించేందుకే అమిత్ షా సమావేశం అయ్యారంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ 25 కు పైగా సినిమాలు చేసారని..అందులో చాలా వరకు హిందీలోనూ డబ్ అయ్యాయని చెప్పుకొచ్చారు. అమిత్ షా వాటిని చూసే ఉంటారన్నారు.

Recommended Video

జూ ఎన్టీఆర్ మద్దతుతో ఇక బీజేపీ - కొడాలి నాని *Politics | Telugu OneIndia
జూ ఎన్టీఆర్ పాన్ హీరో కావటంతో

జూ ఎన్టీఆర్ పాన్ హీరో కావటంతో


జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారారని చెప్పుకొచ్చారు. బీజేపీని విస్తరించే క్రమంలో ప్రధాని మోదీ.. అమిత్ షా ఏం చేసినా రాజకీయంగానే ఆలోచనలు చేస్తారని చెప్పారు. ఉపయోగము లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని వివరించారు. బీజేపీని విస్తరించే క్రమంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం జరిగిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉందని..ఎన్టీఆర్ మద్దతుతో బిజెపిను బలపరచుకోవడానికే అమిత్ షా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని విశ్లేషించారు.

బీజేపీకి ప్రచారం కోసమే సమావేశం

బీజేపీకి ప్రచారం కోసమే సమావేశం


అదే విధంగా పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తో బిజెపి దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనో.. వారితో రాజకీయ అవసరాల కోసమే మాట్లాడుతారని స్పష్టం చేసారు. చంద్రబాబుతో ప్రయోజనం లేదని డిల్లీలో మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదన కొడాలి నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉన్నారో..ఆయన ఏంటో అర్దం చేసుకున్న తరువాత, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ప్రచారం చేయించుకొనే అవకాశం ఉందని కొడాలి నాని విశ్లేషించారు. పవన్ కళ్యాణ్ ను బీజేపీ అగ్ర నేతలు కలవరని..ఆయన పిలిచినా వెళ్లలేదని పవనే చెబుతారని..అది ఎవరికీ అర్దం కాని విషయన్నారు.

పవన్ - ఎన్టీఆర్ ఇద్దరూ అవసరం

పవన్ - ఎన్టీఆర్ ఇద్దరూ అవసరం


ఇక, ఇదే అంశం పైన బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సమావేశం భవిష్యత్ కు మేలు చేసేదిగా అభివర్ణించారు. బీజేపీకి పవన్ - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కావాలని చెప్పుకొచ్చారు. సమావేశం ముగిసిన తరువాత అమిత్ షా ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చారని విష్ణు వర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటు..టీడీపీ నేతలు ఇదే అంశం పైన స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక అంచనాలు..భిన్న వాదనలతో ఇప్పుడు అమిత్ షా - జూ ఎన్టీఆర్ సమావేశం అటు సినీ వర్గాల్లోనూ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది.

English summary
Ex Minister Kodali Nani intereting Comments on Amit Shah and Jr NTR meeting, He says BJP may use ntr for party cmapaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X