ఇక ఇక్కడొద్దు: కోడెలకు చారి, నవ్విన హరీష్(పిక్చర్స్)
హైదరాబాద్: గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతులు సమావేశమయ్యారు. తెలంగాణ సభాపతి మధుసూదనాచారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఉమ్మడి రాజధాని, ఒకే సముదాయంలో అసెంబ్లీల నేపథ్యంలో వారు భేటీ అయ్యారు. అనంతరం మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల స్పీకర్లు ఒకరినొకరు అభినందించుకున్నారు.
అనంతరం సమస్యల పైన చర్చించారు. ఒకే సముదాయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఉండటం సరికాదని, స్పీకర్ పరిధి, సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని, జూబ్లీహాలులో ఏపీ అసెంబ్లీ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏపీ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందని ఏపీ స్పీకర్ కోడెల ప్రశ్నించారు. కౌన్సిల్, అసెంబ్లీలు వేరువేరు చోట్ల ఎందుకని ప్రశ్నించారు.
జూలై మొదటి వారంలో మరోసారి సమావేశమవుదామని, బడ్జెట్ సమావేశాలకు ముందే సమస్యలను పరిష్కరించుకుందామని ఇరువురు అభిప్రాయానికి వచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రం ఉద్యోగులు మరో రాష్ట్రానికి వెళ్లారని, వాటిని కూడా పరిష్కరించుకుందామని చెప్పారు.

సభాపతులు
తెలంగాణ రాష్ట్ర సభాపతి మధుసూదనా చారి, తెలంగాణ మంత్రి హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్‌కు లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ హాలులో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యం.

సభాపతులు
తెలంగాణ రాష్ట్ర సభాపతి మధుసూదనా చారి, తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్‌లు మాట్లాడుకుంటున్న దృశ్యం.

సభాపతులు
తెలంగాణ రాష్ట్ర సభాపతి మధుసూదనా చారి ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్‌కు లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ హాలులో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యం.

సభాపతులు
తెలంగాణ రాష్ట్ర సభాపతి మధుసూదనా చారి, తెలంగాణ మంత్రి హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్‌కు లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ హాలులో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications