అవన్నీ అవాస్తవాలే: jr.NTR టీమ్
ఎన్టీఆర్, ధనుష్ కథానాయకులుగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, ధనుష్ కథానాయకులుగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఈ వార్త విపరీతంగా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ పలు వెబ్‌సైట్‌లు కొన్ని కథనాలను సైతం రాసుకొచ్చాయి. తాజా వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. అవన్నీ ఆధారాల్లేని వార్తలని, అవాస్తవాలని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన డుదల చేసింది.
''ఎన్టీఆర్, ధనుష్, వెట్రిమారన్‌లు కలిసి సినిమా చేస్తున్నారని, గత రెండు, మూడు రోజులుగా కొన్ని అనధికార వార్తలు హల్‌చల్ చేస్తున్నాయని, ఆ వార్తలన్నీ అవాస్తవాలని, దయచేసి అటువంటి ఊహాగానాలతో నిండిన వార్తలను నమ్మొద్దు'' అని పేర్కొంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అని, రెండు భాగాలుగా వస్తుందని, రేపో, ఎల్లుండో షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అని కూడా కొందరు రాసుకొచ్చారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. 'NTR30' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతోనే శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ప్రస్తుతం ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల శివ సినిమా షూటింగ్ పాల్గొంటారు. దీని తర్వాత ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో జూనియర్ ఓ సినిమాను చేయబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. మరోవైపు వెట్రిమారన్ విజయ్‌సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సూర్యతో 'వాడివసల్' సినిమాను రూపొందిస్తారు. ఇక ధనుష్ ఇటీవల 'సార్'తో మంచి విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో 'కెప్టెన్ మిల్లర్' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది.












Click it and Unblock the Notifications