మోడీనేం జగన్ పొగడలేదు, అన్నదొక్కటే: జూపూడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని జగన్ ప్రశంసించడంపై ఆయన ఆచితూచి స్పందించారు. ఒక నేత మూడుసార్లు అధికారంలోకి రావటం అంటే గొప్ప విషయమే కదా అని ప్రశ్నించారు. లౌకికవాదంతో వ్యవహరిస్తే మంచిదని అన్నారే తప్ప అంతకు మించి జగన్‌కు మోడీని వ్యక్తిగత అభిమానం లేదన్నారు.
రాష్ట్ర విభజన జరిపేందుకు కాంగ్రెస్‌కు చెందిన కేరళ, కర్ణాటక, తమిళనాడు ర్రాష్టాల నేతలు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహకరిస్తూ సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, సమైక్యవాద ముసుగులో ముఖ్యమంత్రి విభజనకు కుట్ర పన్నుతున్నారన్నారు.
కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు దొరికాడని, అందుకే పార్టీ తమను అనాధలను చేసిందన్న పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి దత్త పుత్రులు కాంగ్రెస్ నాయకులన్నారు. వైయస్ తన అధికారాన్ని కాంగ్రెస్ నేతలకు అప్పగించి వెళ్లారని వివరించారు.












Click it and Unblock the Notifications