హైకోర్టు సీజేగా ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం - సీఎం జగన్, చంద్రబాబు హాజరు..!!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ని సీఎం వైయ‌స్ జగన్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ధీరజ్ సింగ్ ఠాకూర్ గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయన ప్రమాణం చేశారు. సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ని సీఎం వైయ‌స్ జగన్ ఘ‌నంగా స‌న్మానించారు. 1964 ఏప్రిల్ 25న జస్టిస్ ఠాకూర్ జన్మించారు.1989 లో ఢిల్లీలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన జమ్మూకాశ్మీర్ లో న్యాయవాదిగా పనిచేశారు. 2011లో ఆయన సీనియర్ అడ్వకేట్ అయ్యారు.

jaganchandrababunaidudheerajsingh1

2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న ఠాకూర్ ముంబై హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముంబై నుండి ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ సింగ్ ఠాకూర్ కుటుంబంలో అందరూ న్యాయమూర్తులే. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోదరుడు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు చాలాకాలం తరువాత ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజే ప్రమాణ స్వీకారానికి ఇద్దరు హాజరు కావటం ఆసక్తి కరంగా మారింది.

justicedhirajsinghthakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+