అసలు జెఎఫ్‌సి ఎందుకంటే;తేల్చిచెప్పిన జస్టిస్ గోపాల గౌడ;ఆయనెందుకు వచ్చారు?
Recommended Video

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడిని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం నేడు హైదరాబాద్ దసపల్లా హోటల్లో జరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తదిదరులతో పాటు పలువురు రాజకీయ,సామాజిక, ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులు కూడా పాల్గొంటున్నారు.
తొలిరోజు సమావేశాల్లో కేంద్ర నిధులు, విభజన హామీలు వీటికి సంబంధించిన వివరాల సేకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొంటున్నన్యాయమూర్తి గోపాల గౌడ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిందని, అయితే ఏపీకి రావాల్సిన నిధులు సరిగా రావడంలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో తనకు చాలా సంతోషంగా ఉందని గౌడ చెప్పారు. న్యాయమూర్తిగా ఉన్న తాను ఈ కమిటీకి కావాల్సిన సలహాలు తప్పకుండా ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇచ్చింది...ఇంకా ఏమేమి ఇవ్వాల్సి ఉంది అనే దానిపై ఒక నివేదిక తయారు చేయడానికే ఈ జెఎఫ్‌సి ఏర్పడిందని, ఇందులో సందేహానికి తావులేదని జస్టిస్ గోపాల గౌడ స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌తో తనకు చాలా దగ్గరి సంబంధం ఉందని, తన తల్లిది చిత్తూరు జిల్లా అని జస్టిస్ గోపాల గౌడ చెప్పారు.
మరోవైపు జెఎఫ్‌సి సమావేశానికి వైసిపికి చెందిన తోట చంద్రశేఖర్ అనే నేత హాజరుకావడం చర్చనీయాంశం అయింది. ఇదే విషయమై తోట చంద్రశేఖర్ ను ప్రశ్నించగా తాను వ్యక్తిగతంగా సమావేశానికి హాజరయ్యానంటూ తోట చంద్రశేఖర్ మీడియాతో చెప్పడం గమనార్హం. నేడు, రేపు సమావేశఆల అనంతరం జేఎఫ్‌సీ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు












Click it and Unblock the Notifications