ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి: మాజీ జస్టిస్ రాకేష్ స్థానంలో: ప్రమాణ స్వీకారం
అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి నియమితులు అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ చేయడం ద్వారా ఏర్పడిన ఖాళీని జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ బదిలీతో భర్తీ అయింది. ఈ ఉదయం హైకోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా జోయ్‌మల్యా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది హాజరయ్యారు.
జస్టిస్ రాకేష్ కుమార్ కిందటి నెల 31వ తేదీన పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన ఆయన గత ఏడాది ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక్కడే పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీని నియమించారు. ఇంతకుముందు వరకు జస్టిస్ బాగ్చీ కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కాగా- ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి కూడా ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలిసిందే. ఆయనను సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియమితులయ్యారు. గురువారం ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జస్టిస్ హిమా కోహ్లీకి పదోన్నతి కల్పిస్తూ.. తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించింది. తెలంగాణ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను కోల్‌కత హైకోర్టుకు బదిలీ చేసింది. కాగా.. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన మురళీధర్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications