''తెలుగుదేశం''కి నూతన సారథి!
సోషల్ మీడియా పరంగా తెలుగుదేశం పార్టీ అత్యంత బలోపేతంగా ఉంది. అయినప్పటికీ ఎక్కడా పట్టు సడలకుండా ఉండేందుకు కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ సోషల్ మీడియా కొత్త అధినేతగా జీవీ రెడ్డిని నియమించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీతోపాటు కీలకమైన సోషల్ మీడియా విభాగంలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే జీవీ రెడ్డి నియమితులయ్యారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా ప్రధాన బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవలే అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ విషయంలో ప్రభుత్వానికి, విజయ్ కు వివాదం నడిచిన సంగతి తెలిసిందే. న్యాయ విద్యతోపాటు సీఏ చేసిన జీవీ రెడ్డికి సామాజిక, రాజకీయ, వర్తమాన, ఆర్థిక వ్యవహారాలపై లోతైన అవగాహన ఉంది. వీటికి సంబంధించిన ఏ విషయాన్నైనా సులువుగా విశ్లేషించగలరు. దీనివల్లే జీవీ రెడ్డి సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చింతకాలయ విజయ్ తో కలిసి సోషల్ మీడియాను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఇకనుంచి రెడ్డికి కూడా పార్టీ అప్పగించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఒకరి ఆరోపణలపై మరొకరు ప్రత్యారోపణలు చేసుకోవడం, వాట్సాప్ లో న్యూస్ ను సర్క్యులేట్ చేయడం, ట్విట్టర్ లో ఖండించడం.. ఫేస్ బుక్ లో కొత్త పోస్టులు పెడుతుండటం లాంటివన్నీ జరుగుతున్నాయి. నేరుగా ఎన్నికల సమరంలో తలపడకుండా ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాద్వారా అంతకుమించి తలపడుతున్నాయి.












Click it and Unblock the Notifications