నేను వెళ్తున్నా, ఇకనైనా మారు: జగన్‌పై నెహ్రూ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: నేను పార్టీ మారిన తర్వాతనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు. ఆయన మరో వారం రోజుల్లో సైకిల్ ఎక్కనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం తాను అన్నింటిని దిగమింగుకొని పని చేశానని చెప్పారు. పీఐసీ చైర్మన్ పదవి కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకోలేదని, ప్రజలే తనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు.

తనకు ఎన్నో పదవులు చేతి దాకా వచ్చాయని, పదవులు తనకు ఓ లెక్క కాదని చెప్పారు. వైసిపిలో సమష్టి నాయకత్వం, సమష్టి ఆలోచనలు లేవన్నారు. అందుకే తాను పార్టీ మారాలనకుంటున్నానని చెప్పారు. రాజకీయ పార్టీగా వైసిపి పరిణితి చెందలేదని చెప్పారు.

Jyothula Nehru hot comments on YS Jagan

వైసిపిలో ఉంటే ప్రజా సేవ చేయలేమనే: నారాయణ

ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. వైసిపిలో ఉంటే ప్రజాసేవ చేయలేమని వారు భావిస్తున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే ఉంటాయని చెప్పారు.

తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగు రైతులకు త్వరలో పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది జూన్ - జూలై నాటికి ఉద్యోగులను ఏపీ రాజధాని అమరావతికి తరలిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+