8న టిడిపిలోకి నెహ్రూ, ఎన్నికల ఖర్చుకు ఏదో చేద్దాం కానీ... బాబు

విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు తెలుగుదేశం పార్టీలో చేరే ముహూర్తం ఖరారయింది. వీరిద్దరు ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు.

అవినీతికి దూరంగా ఉండండి: చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ పైన దృష్టి సారించారు. ఆయన పార్టీ నేతల ప్రవర్తన పైనా కన్నేశారు. గురువారం హైదరాబాదులోని సచివాలయంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Jyothula Nehru will join TDP on 8th April

ఈ సందర్భంగా సదరు భేటీ ముఖ్య ఉద్దేశాన్ని చంద్రబాబు సుతిమెత్తగా మందలించారు. ఎన్నికల్లో నానాటికీ పెరిగిపోతున్న ఖర్చును ఆయన ప్రస్తావించారు. ఎన్నికల ఖర్చు కోసమని అవినీతికి పాల్పడతామంటే కుదరదని హెచ్చరించారని తెలుస్తోంది.

అవినీతి మకిలిని చేతులకు అంటించుకునే నేతలను వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

ఎన్నికల్లో ఖర్చు పెరిగిపోయిన మాట నిజమేనని, కానీ అందుకోసం తప్పులు చేయవద్దని, పేదల్లో ఎనభై శాతం మందికి ప్రభుత్వపరంగా ఏదో ఒక లబ్ధి కలిగేలా యత్నిస్తున్నామని, ఎన్నికల్లో ఖర్చులకు ఏదోలా కిందా, మీదా పడదామని, అవినీతికి మాత్రం దూరంగా ఉండాలని సూచించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+