కేసీఆర్, బాబు కలిసే: టీ, ఏపీ మంత్రులు కలిసి తిన్నారు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నలుగుతున్న సున్నిత సమస్యలను పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ చేసిన సూచనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సోమవారం ఏకాభిప్రాయం కుదిరింది.

రెండు రాష్ట్రాల్లోని వనరులను పరస్పరం వినియోగించుకుంటూ ముందుకు సాగడం వల్ల ఇరు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో ఉమ్మడిగానూ, ఏకాంతంగానూ మాట్లాడుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులు వీలైనంత త్వరలో మరోమారు సమావేశమై వివిధ అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్యలో చిన్నచిన్న వివాదాలకు తావివ్వరాదని, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించుకోవాలని గవర్నర్ చేసిన సూచన ఫలించింది.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

ముఖ్యంగా జలవనరులు, విద్యుత్, నిధులు, విద్యా రంగాలకు సంబంధించి తీవ్ర విబేధాలు పొడసూపిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో మరోమారు చర్చించుకోవడం ద్వారా సానుకూల దృక్పథాన్ని తీసుకోవాలనే భావన వ్యక్తమైందని సమాచారం.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు, తెలంగాణ శాసన సభాపతి మధుసూదనాచారి.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు.. గవర్నర్‌తో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. గణతంత్ర వేడుకలు ఇరు రాష్ట్రాల్లో బాగా జరిగాయని, ఇరు రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకున్నారని, అన్ని విషయాలు చర్చించామని, అందరం కలిసే ఉన్నామని, మీరే చూస్తున్నారని ఇరువురు సీఎంలను చూపిస్తూ అన్నారు.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పక్కన గవర్నర్ సతీమణి..

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు పక్కపక్కన..

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రుల దృశ్యం.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పక్కన జానా రెడ్డి.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+