పెద్దఎత్తున హామీలిచ్చి: లక్ష్మణ్, కోమటిరెడ్డి పెదవివిరుపు

గవర్నర్ ప్రసంగం చాలా చప్పగా ఉందని పెదవి విరిచారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలనే గవర్నర్‌తో మరోసారి చదివించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రకటనలపై స్పష్టత వస్తుందని ఆశించామని అయితే, ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నారు.
గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదన్నారు. ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఆందోళనతో ఇప్పటికే పదిహేను, ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
తెరాస ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కనిపించడం లేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారని, దానిని ఎప్పటి లోగా ఇస్తారనే విషయం లేదన్నారు. గవర్నర్ ప్రసంగం చప్పగా ఉందని చిన్నారెడ్డి అన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తప్పుకుంటోందన్నారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని, అవన్నీ లేవన్నారు.












Click it and Unblock the Notifications