కేఏ పాల్ అస‌లు పేరు ఇదే : ఆయ‌న ల‌క్ష్యం మెగా సోద‌రులు : ఓడించి తీరుతా..!

కేఏ పాల్. ఇప్పుడు ఏపి రాజ‌కీయాల్లో ప్ర‌తీ రోజు వినిపిస్తున్న పేరు. ఆయ‌న ఎంతో కాలంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ..అధికారంలోకి రావాల‌నేది ఆయ‌న క‌ల‌. ప్ర‌జాశాంతి పార్టీ ద్వారా ప్ర‌స్తుత ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. పార్టీ గుర్తు హెలికాఫ్ట‌ర్ త‌మ పార్టీ గుర్తు ఫ్యాన్ తో పోలి ఉంద‌ని..మార్చాల‌ని వైసిఇ ఇసిని అభ్య‌ర్దించింది. దీని పైనా స్పందించిన పాల్..ఎన్నిక‌ల్లో త‌న అస‌లు ల‌క్ష్యం ఏంటో స్ప‌ష్టం చేసారు.

మెగా సోదురుల ఓట‌మే ల‌క్ష్యం..
కేఏ పాల్ ఈ సారి ఎన్నిక‌ల్లో త‌న లక్ష్యం ఏంటో స్ప‌ష్టం చేసారు. తాను ఇప్ప‌టికే న‌ర్సాపురం నుండి ఎంపీగా నామినేష న్ దాఖ‌లు చేసారు. శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేసి సాయంత్రం తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో త‌న పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేసార‌ని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. దీనికి నిర‌స‌న‌గా తాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనా పోటీ చేస్తాన‌ని ప్ర‌క టించారు.

KA Paul challenge to Mega Brothers : will defeat pawan and Nagababu in elections

సోమ‌వారం తాను భీమ‌వ‌రం నుండి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు నియోజ‌క‌వ ర్గాల్లోనూ మెగా సోద‌రుల‌ను ఓడించ‌ట‌మే త‌న లక్ష్య‌మ‌ని పాల్ స్ప‌ష్టం చేసారు. త‌న మీద జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడు లు చేస్తున్నార‌ని..వారి పై ఫిర్యాదు చేయ‌టంతో పాటుగా ర‌క్ష‌ణ క‌ల్పించాల్సింది రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసి ఫిర్యాదు చేస్తాన‌ని పాల్ ప్ర‌క‌టించారు.

త‌న పేరు గురించి చెబుతూ..
కేఏ పాల్ మెగా బ్ర‌దర్స్ గురించి మాట్లాడుతూ త‌న పేరు కిడారి ఆనంద పాల్ అని నేప‌థ్యం గుర్తు చేసారు. ఈ ఎన్నిక ల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని ఐదు లక్షలు ఖర్చు పెట్టమని చెబుతున్నామని.. అంతకంటే ఎక్కువగా అడగటం లేదని తెలిపారు. చంద్రబాబు, జగన్, పవన్‌లకు ఓటెయ్యొద్దని, వాళ్లు తిరిగే హెలికాఫ్టర్‌కు వెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేయాలని కోరుతూ విజయసాయి రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. తమకు ఓటర్లే జెండాలని.. తమకు ఎలాంటి జెండాలు లేవన్నారు.త‌మ హెలికాఫ్ట‌ర్ ద్వారా ఫ్యాన్ ఊడి పోవ‌టం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+