పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సరికొత్త విశ్లేషణ
తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. పవన్ ఫెయిల్డ్ పొలిటీషియన్ అని స్వయంగా ఒప్పుకున్నారని, ఆ గట్స్ తనకు నచ్చాయని పాల్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ విషయం తాను ప్రజారాజ్యం పెట్టిన సమయంలోనే పవన్ కు చెప్పానని, ఏ పార్టీలో చేరొద్దు, కలిసి పని చేద్దామని 2008లోనే పవన్ కల్యాణ్ కు చెప్పానన్నారు.
అప్పుడు తన మాట వినకుండా జనసేన పార్టీని ఏర్పాటుచేసి తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చారన్నారు. బీజేపీ కూడా మతతత్వ పార్టీ అని పవన్ విమర్శించారని, ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, బీఎస్పీతో కలిసి పోటీచేశారన్నారు. మళ్లీ బీజేపీతో జతకట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. పవన్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారని, ఆర్ ఎస్ఎస్ భావజాలం ఉన్న పార్టీని రోడ్ మ్యాప్ అడగటం ఏమిటతో తనకు అర్థం కావడంలేదన్నారు.

నీతి, నిజాయితీ కోసం పవన్ పనిచేయాలనేది తన ఉద్దేశమని, వందశాతం విజయం కావాలంటే తనతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇన్ని పార్టీలతో పవన్ కలుస్తూ ఉండటంవల్ల నిలకడ లేకుండా ఉంటే ఎలా విజయం సాధిస్తారని పాల ప్రశ్నించారు. తనతో కలిసి ధైర్యంగా ముందుకు రావాలని,
అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడంవల్లే ఫెయిల్డ్ పొలిటీషియన్ గా ఉన్నారని పాల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications