కేఏ పాల్ కోడలి ఫిర్యాదతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు: చంద్రబాబుకు ఆర్జీవీ వినతి
హైదరాబాద్: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మ దర్శకత్వం వహించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా డిసెంబర్ 12న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఏపీ హైకోర్టు, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. దీంతో సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు
అయితే, రాంగోపాల్ వర్మ తాజాగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కేఏ పాల్.. రాంగోపాల్ వర్మ సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయంపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తాము దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని, రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని జ్యోతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వర్మపై కేసు నమోదు..
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌కు ఫొటోలను వర్మ మార్ఫింగ్ చేసి వాటుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 469 కింద పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తాము దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని, ఆ ఫొటోలను తొలగించాలని జ్యోతి పోలీసులను కోరారు. రాంగోపాల్ వర్మ ఫొటోలు మార్ఫింగ్ చేసిన ఐపీ నెంబర్ కోసం గూగుల్‌కు లెటర్ పెట్టారు పోలీసులు.
చంద్రబాబుకు వర్మ విన్నపం
ఇది ఇలా ఉండగా, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోలిన వ్యక్తి నటిస్తున్న విషయం తెలిసిందే. అతను చంద్రబాబు నాయుడు ఆటోగ్రాఫ్ కావాలంటున్నాడని.. చంద్రబాబు ఆయన కోరిక తీర్చాలని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కోరారు.












Click it and Unblock the Notifications