కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్ లానే చనిపోతావంటూ పవన్‌కు శాపనార్థాలు.. !!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన శాపం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని వ్యాఖ్యానిస్తూ తీవ్ర వివాదానికి తెరతీశారు. తాను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే పవన్ కళ్యాణ్ కూడా చనిపోతారంటూ మాట్లాడారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల కూడా హాట్ కామెంట్స్ చేయడం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్‌పై శాపనార్థాలు..

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేఏ పాల్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిలా చనిపోతావు" అంటూ శాపనార్థాలు పెట్టడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అలానే ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ ది సహజ మరణం కాదని.. ఆయన్ను చంపేశారు అంటూ వ్యాఖ్యానించడం మరో వివాదానికి కారణమైంది.

ka-paul-sensational-comments-over-pawan-kalyan-and-ysr-death

వైఎస్సార్ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు..

వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 ఆగస్టులో తన చారిటీ సంస్థలకు చెందిన 14 బ్యాంకు ఖాతాలను వైఎస్సార్ ప్రభుత్వం మూసివేసిందని అన్నారు. అందుకు సెప్టెంబర్ 1న ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశానని.. సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ కూలిపోయిందని.. తన శాపం వల్లే ఆయన మరణించారని పాల్ అన్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు వార్నింగ్..

అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డా లేక చంద్రబాబా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు చెప్పిందే రేవంత్ చేస్తున్నారని.. మీ గుండెలు ఆగిపోకముందే, యాక్సిడెంట్లు జరగకముందే దేవుడిని భయపడండి.. లేదంటే సర్వనాశనం తప్పదు అంటూ హెచ్చరించారు.

మీడియాపై తీవ్ర ఆగ్రహం..

తనపై తప్పుడు కేసులు, అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీడియా ఓనర్లు, సీఈఓలు, రిపోర్టర్లు 30 రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవుడు వారి కుటుంబాల్లో అనారోగ్యం, యాక్సిడెంట్లు లేదా ఆర్థిక నష్టాల రూపంలో శిక్షిస్తాడు అంటూ హెచ్చరించారు.

మరోవైపు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాత్రికి రాత్రే కిడ్నాప్ చేయించారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?" అని ప్రశ్నించారు. తాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అమెరికాలో చర్చలు జరిపినట్లు తెలిపారు. తనకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అభిమానులు ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ వంటి నేతలు తనను గౌరవిస్తారని కేఏ పాల్ తెలిపారు. తనను చంపాలని ప్రయత్నించినవారు కుక్కచావు చస్తున్నారని.. దేవుడి శక్తి ముందు ఎవరూ నిలబడలేరు అంటూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి కేఏ పాల్ చేసిన ఈ వరుస వ్యాఖ్యలు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా శాపనార్థాలు, మరణాలపై చేసిన వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారితీస్తాయా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై సంబంధిత నేతలు, మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+