మీకా దమ్ముందా.. విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్!!
ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో రాజకీయంగా దుమారం రేగింది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. విజయసాయిరెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ వేసిన కేఏ పాల్ నువ్వేమైనా బీజేపీ అధికార ప్రతినిధివా లేక మోడీకి తొత్తువా అంటూ ప్రశ్నించారు . ఏపీలో మరో రెండు నెలల్లో ఏమవుతుందో తెలుసా అంటూ పేర్కొన్న కె ఏ పాల్ ఏపీలో ఓడిపోవడానికి సిద్ధమా.. అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీకి పడగొట్టే దమ్ముందా అంటే నిలదీశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ఉద్యోగాలు కల్పనపై ఎప్పుడైనా బీజేపీతో పోరాడారా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా కేంద్రంలోని బిజెపి సర్కారుతో యుద్ధం చేశారా అంటూ నిలదీశారు.
ఇక రెండు రోజుల క్రితం మోడీ తొత్తులతో యుద్ధం.. మన విశాఖతో సిద్ధం పోస్టర్ ను విడుదల చేసిన కేఏ పాల్, తాను మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడగలనని పేర్కొన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి పై ఎన్నికల బరిలో తను పోటీకి దిగుతున్నానని ఓటు చీలకుండా ఉండాలంటే తనను విశాఖ ఎంపీగా ఎన్నుకోవాలని ఆయన కోరారు.
ఫిబ్రవరి 17వ తేదీన విశాఖలో ప్రజాశాంతి పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారని దేనికి సిద్ధం చెప్పాలన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు 20 లక్షల కోట్లు చేయడానికా... ఇచ్చిన మాట తప్పడానికి సిద్ధమా అంటూ ఎద్దేవా చేశారు . తాను 7 హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు తీర్చేస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications