జగన్ సొంత జిల్లాలో వాడు చిక్కాడు, కాలేజ్ అమ్మాయితో !!

మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం జరగడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కాలేజ్ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. ఇంటర్ కాలేజ్ అమ్మాయి 80 శాతం కాలిపోయింది.

ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కన ఉండే ముళ్లపోదల్లోకి పిలుచుకుని వెళ్లి ఆ ముళ్ల చెట్లలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్నేష్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడని పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలైన విద్యార్థినిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kadapa District Inter College girl s Petralo attack case arrested by police

కేసు నమోదు చేసిన బద్వేల్ గ్రామీణ పోలీసులు నిందితుడు విగ్నేష్ ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బద్వేల్ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు విగ్నేష్ కి, ఇంటర్ విద్యార్థినికి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. విఘ్నేష్ కు పెట్రోల్ ఎవరు ఇచ్చారు అని పోలీసులు ఆరా తియ్యడంతో ఓ ఆటో డ్రైవర్ గురించి తెలిసింది.

బద్వేలు సమీపంలోని సెంచురీ ప్లైవుడ్ సమీపంలో ఈ సంఘటన జరగడంతో బద్వేల్ లో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని పోలీసు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు విఘ్నేష్ ను అదుపులోకి తీసున్నారు. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+