వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తొలిరోజు రెండు గంటలకు పైగా విచారిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సీబీఐ బృందం ఈ విచారణ సాగిస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఏపీలో నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా అనుమానితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారణకు పిలిపించింది. దీంతో హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న సీబీఐ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన వెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకే సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి తన లాయర్ ను కూడా విచారణకు అనుమతించాలని సీబీఐ అధికారుల్ని కోరారు. అయితే సీబీఐ అధికారులు అందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీబీఐ బృందం అవినాష్ ను విచారిస్తోంది. ఇందులో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరోజు విచారణ సందర్భంగా అవినాష్ పై సీబీఐ అధికారులు రెండు కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

kadapa mp ys avinash reddy attends cbi inquiry in hyderabad, lawyer not allowed inside

తొలిరోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ తో పాటు ఆయన ఆర్ధిక లావాదేవీల గురించి ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. లాయర్ లేకుండానే విచారణలో పాల్గొంటున్న అవినాష్ రెడ్డి సీబీఐ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు మన్నించారా లేదా అన్నది తేలలేదు. ఇవాళ అవినాష్ ను ఇప్పటికే రెండు గంటలకు పైగా విచారిస్తున్న అధికారులు.. ఇవాళ విచారణ పూర్తి కాకపోతే రేపు కూడా పిలిపించే అవకాశం ఉందని చెప్తున్నారు.

English summary
cbi officials inquire kadapa mp ys avinash reddy today in ys vivekananda reddy murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X