టీడీపీలోకి వైసీపీ కడప ముఖ్యనేతలు - ఆపరేషన్ షురూ..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఏడు సీట్లకే పరిమితమైన వైసీపీని మరింత దెబ్బ తీసేందుకు అధికార కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. కడప జిల్లా నుంచే ఆపరేషన్ వైసీపీ ప్రారంభించారు.శాసన మండలిలో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఎమ్మెల్సీల పైన ప్రధానంగా ఫోకస్ చేసారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు టీడీపీతో టచ్ లోకి వెళ్లారు.
ఆపరేషన్ వైసీపీ
ఏపీలో కూటమి తాజా ఎన్నికల్లో 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అందులో జగన్ సొంత జిల్లాలో టీడీపీ అనూహ్యంగా సీట్లు దక్కించుకుంది. అసెంబ్లీలో 164 స్థానాల బలం ఉన్నా..మండలిలో మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో.. శాసన మండలి వైసీపీ సభ్యుల పైన టీడీపీ ఫోకస్ చేసింది. జగన్ సొంత జిల్లా కడప నుంచి ఆపరేషన్ ప్రారంభించింది. అందులో భాగంగా సీమ జిల్లాలకు టీడీపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది.

కడప నుంచి షురూ
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జకియా ఖానమ్ తాజాగా మంత్రి ఫరూక్ తో సమావేశమయ్యారు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా శాసన మండలిలో తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్ అయ్యారు. ముస్లిం మహిళకు డిప్యూటీ ఛైర్మన్ హోదా ఇచ్చామని జగన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావటంతో జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా జకియా ప్రస్తుతం టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.
టీడీపీ నేతల మంత్రాంగం
అదే విధంగా కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి టీడీపీతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన సోదరుడు రఘునాధ రెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో, మల్లిఖార్జున రెడ్డి టీడీపీలో చేరుతారన్నాని..స్థానికంగా టీడీపీ నాయకత్వంతో ఉన్న సమస్యల పరిష్కారం పైన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక..సీమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో టీడీపీ నేతలు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications