నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నీ బయటకు, తప్పించుకోలేరు: మోడీ వద్దకు సోమిరెడ్డి-కాకాని పంచాయతీ!

తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం కాకాని మరోసారి సోమిరెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు.

సై అంటే సై: నిరూపిస్తా.. విరుచుకుపడ్డ కాకాని, రాజకీయాలు వదిలేస్తా.. సోమిరెడ్డిసై అంటే సై: నిరూపిస్తా.. విరుచుకుపడ్డ కాకాని, రాజకీయాలు వదిలేస్తా.. సోమిరెడ్డి

కేసులు, జైళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. పోలీసులు వెంటనే సోమిరెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి వ్యవహారంలో తాను త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

somireddy chandramohan reddy

తాను చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సూది కోసం సోదికి పోతే సంగతులన్నీ బయటపడ్డాయని సోమిరెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

అదీ మర్యాద!: చంద్రబాబుకు 'ప్రసాదం' సెంటిమెంట్అదీ మర్యాద!: చంద్రబాబుకు 'ప్రసాదం' సెంటిమెంట్

సోమిరెడ్డి తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. సీబీఐ నుంచి ఈడీ వరకు అందరికీ ఫిర్యాదులు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతోందన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా పోరాటం చేస్తాం తప్ప సోమిరెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నారు.

English summary
YSRCP leader Kakani Goverdhan Reddy will meet PM Modi over Somireddy Chandramohan Reddy assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X