పవన్‌కు బిగ్ షాక్..జనసేనకు కీలక నేత గుడ్ బై

సార్వత్రిక ఎన్నికల ముందు జనసేనకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన సంగతి అందరికి తెలిసిందే. అసలు ఈ కూటమి కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే కూటమి ఏర్పడిన తరువాత ఆ పార్టీ నుంచే ఎక్కువ వ్యతిరేకతం వ్యక్తం కావడం గమనర్హం. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. పవన్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇటీవలే అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ కూడా పవన్ కల్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

KAKINADA CITY incharge Mootha Sasidher quit from janasena

తాజాగా మరో కీలక నేతా జనసేనను వీడటానికి రెడీ అవుతున్నట్టు సమాచారం అందుతోంది.కాకినాడ సిటీ ఇంచార్జ్ ఉన్న ముత్తా శశిధర్ సైతం జనసేనను వీడటానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో .కాకినాడ సిటీ నుంచి పోటీ చేశారాయన. గతంలో కాకినాడలో పర్యటించిన సమయంలో ఇక్కడి సీటును ముత్తా శశిధర్‌కే కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా ఆ సీటు ఇప్పుడు టీడీపీకి ఖారారు కావడంతో .. ముత్తా శశిధర్‌‌కు మొండిచేయి ఎదురైంది.

గడిచిన ఐదేళ్లుగా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేసి జనసేనను బలోపేతం చేశారాయన. టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్న ముత్తా శశిధర్‌ జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన పవన్ కల్యాణ్ పర్యటనకు సైతం దూరంగా ఉన్నారు. దీంతో ముత్తా శశిధర్‌ జనసేనను వీడటం ఖాయమనే పార్టీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. ఒకటి , రెండు రోజుల్లో ముత్తా శశిధర్‌ తన రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+