‘ఆందోళన వద్దు-కల్కీ భగవాన్ క్షేమంగానే ఉన్నారు’
చిత్తూరు: ఆధ్యాత్మిక గురువు కల్కీ భగవాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వచ్చిన వార్తలు కేవలం వదంతులేనని కల్కి ఆశ్రమం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆశ్రమ యాజమాన్యం ప్రతినిధి ఉమాపతి ఓ ప్రకటన విడుదల చేశారు.
కల్కీ ఆరోగ్యంపై పలు విషయాలను ఆయన ప్రకటనలోవెల్లడించారు. కల్కి ఐసీయూలో ఉన్నారని వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఆయన క్షేమంగానే ఉన్నారని.. దైనందిన ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

మూడు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చారని తెలిపారు. భక్తులెవరూ ఆందోళనకు గురికావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. త్వరలోనే జయలలిత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు కూడా తెలిపారు.












Click it and Unblock the Notifications