జగన్ ఓటమితో హ్యాపీగా ఉన్నాం : కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులను ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయడ్డారు.
ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా మెగాస్టార్ చిరంజీవిని సైతం జగన్ అవమానించారని భావించిన సినీ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తిరిగి విజయం సాధించకూడదని భావించారు. దీనిలో భాగంగానే కూటమి అభ్యర్ధులకు బహిరంగంగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించారు.

అందరు అనుకున్నట్టే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా జగన్ ఓటమి గురించి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాను ప్యాన్ ఇండియా లేవల్లో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద కల్కి పెద్ద హిట్ కావడంతో నాగ్ అశ్విన్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి విజయం సాధించి ఉంటే .. అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..అప్పుడు మీ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాగ్ అశ్విన్‌కు ఎదురైంది. అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చారు. జగన్ పార్టీ ఓడిపోవటం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేశారు. నాగ్ అశ్విన్ మామ అశ్వనీదత్ అనే విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అశ్వనీదత్ బలంగా కోరుకున్నారు.












Click it and Unblock the Notifications