బయటివారిని పిల్చి ఫోటోదిగిన రోజా, ప్రివిలేజ్ మోషన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన తెలుగుదేశం పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు బుధవారం నాడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. మంగళవారం నాడు సభ వాయిదా పడిన అనంతరం బయటి వ్యక్తులను పిలిచి ఫోటోలు దిగారని ఆయన తాను ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. రోజా తీరును సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కాల్వ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
కాగా, ఏపీ అసెంబ్లీ ఉదయం ప్రారంభమైంది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైన శాసన సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం మోసగిస్తోందని విమర్శించారు. టీడీపీ తన మేనిఫెస్టోలో చెప్పిందేమిటీ, చేస్తుందేమిటని ప్రశ్నించారు. జగన్ టీడీపీ మేనిఫెస్టోను సభలో చదివి వినిపించారు.

దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయమై కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖలో పని చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులేనని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. క్రమబద్ధీకరణ పైన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందన్న దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకరు తిరస్కరించిన అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాంట్రాక్టు వ్యవస్థపై వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications