వైయస్ డ్రెస్ చూసే, పరిటాలను చంపేశారు: జగన్‌పై దుమ్మెత్తిపోసిన కాల్వ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 'గడపగడపకూ వైసిపి' పైన తెలుగుదేశం పార్టీ నేతలు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శుక్రవారం నాడు దుమ్మెత్తిపోశారు.

జగన్‌కు ప్రజల వద్దకు వెళ్లే నైతిక అర్హత లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ సెజ్‌ల పేరిట దోచుకున్నారన్నారు. పదకొండు ఛార్జీషీట్లలో ఏ1గా ఉన్న నిందితుడు ప్రజల్లోకి వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి డ్రెస్సు చూసి 2004లో ఆయనకు రైతులు ఓట్లు వేశారని, అయితే, ఆయన పరిపాలనలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయని కాల్వ ఆరోపించారు. వైయస్ పంచెకట్టి రైతులకు చేసిన సేవ ఇదేనంటూ విమర్శించారు.

Kalva Srinivasulu lashes out at YSRCP Chief Jagan

టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు తొలి సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

రాజశేఖర రెడ్డిగారి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమంటున్నారని, ఆయన పంచె కట్టుకుని పొలాలన్నింటిని బంగారం చేశారంటున్నారని, సూట్ వేసుకుని పరిశ్రమలకు ఆయన అడ్రసుగా మారారని చెబుతున్నారని, కానీ అవన్నీ అవాస్తవాలన్నారు.

2004లో ఆయన దుస్తులు చూసి రైతులు ఓట్లు వేశారన్నారు. ఆయన పరిపాలనలో దేశంలో ఎక్కడా జరగనన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. వైయస్ పాలనలో కరెంట్ సమస్య వల్ల చిన్న తరహా, మధ్య తరహా యూనిట్లు మూతపడిపోయాయన్నారు. కార్మికులు బజారు పాలయ్యారన్నారు.

ఇదేనా ఆయన హయాంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి అన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రసుగా ఏపీని మార్చి, ప్రతిపక్షాల కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులను చేసి, సర్కార్ హత్యలు చేసి, పరిటాల రవీంద్ర లాంటి నాయకుడిని ప్రభుత్వమే స్వయంగా హత్య చేయించిన సంఘటనలు చూశామన్నారు. ఇలాంటి దుర్మార్గ పాలనకు తాము వారసులమని జగన్ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Government chief whip Kalva Srinivasulu lashes out at YSRCP chief YS Jagan

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి