'కేంద్రం కాళ్లు పట్టుకొని, ఇప్పుడు జగన్ కొత్త నాటకం, రాజీనామాల మాటేమిటి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చేపట్టిన యువభేరి, నవంబర్ నెలలో పాదయాత్ర నాటకాలు అని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.

మోడీ వస్తే మాట్లాడలేదు: ఈనాడును చూపిస్తూ.. బాబును దులిపిన జగన్, బీజేపీని టార్గెట్ చేశారు కానీ

పాదయాత్ర పేరుతో జగన్ ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని నిలదీశారు. గతంలో కేంద్రం కాళ్లు పట్టుకున్న జగన్ ఇప్పుడు యువభేరి అంటూ కొత్త నాటకం ప్రారంభించారన్నారు.

Kalva Srinivasulu questions about YSRCP MPs resignations

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఆ తర్వాత మాట తప్పారన్నారు. జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపీలతో వెంటనే రాజీనామా చేయించాలన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ద్వారానే రాష్ట్రానికి ఏంతో మేలు జరిగుతుందన్నారు. యువభేరీ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and Minister Kalva Srinivasulu has questioned YSR Jaganmohan Reddy about YSRCP MPs resignations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి