పవన్ కల్యాణ్‌తో బంధం: క్లారిటీ ఇచ్చేసిన దిలీప్ సుంకర

హైదరాబాద్: జనసేనతోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తోనూ తన సంబంధాలపై కల్యాణ్ దిలీప్ సుంకర క్లారిటీ ఇచ్చేశారు. మహేష్ కత్తి ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఆ స్పష్టత ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా జనసేనలో సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్త, పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నాయకుడు దిలీప్ సుంకర సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంపై ఆయన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

మీకంత భారం అనిపిస్తే...

మీకంత భారం అనిపిస్తే...

"మీకంత భారం అనిపిస్తే నేను ఎవరికీ భారం కాదలుచుకోలేదని, పదే పదే ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ... నాకు పార్టీకి సంబంధం లేదనే వ్యాఖ్యలు వినీ వినీ నా చెవులు హొరెత్తిపోతున్నాయి, మీకు అంత సరదాగా ఉది కనుక" అని దిలీప్ సుంకర తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఒక్కడినే వచ్చా.. ఒక్కడిగానే పోరాడా....

ఒక్కడినే వచ్చా.. ఒక్కడిగానే పోరాడా....

తాను ఒక్కడిగానే వచ్చానని, ఒక్కడిగానే పోరాడానని, ఒక్కడిగానే వెళ్లిపోతున్నానని దిలీప్ సుంకర అన్నారు. కింద ఉన్న ఎదవల బజారు వ్యాఖ్యలను ఏ రోజు కూడా పవన్ కల్యాణ్ ఖండించకపోగా వాళ్లని కీలక పదవుల్లో కొనసాగించడం ఆయన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది కనుక అని, ఇక తాను జనసేన అబిమానిగా కూడా కొనసాగదలుచుకోలేదని అన్నారు.

శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తుంటే...

శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తుంటే...

పార్టీ ఆఫీస్ వ్యక్తుల చెంచాలు శ్రుతి మించి వ్యాఖ్యానాలు చేస్తుంటేతాను రోడ్డు ఎక్కుతానని, అల్రెడీ విసిగి విసిగి ఉన్నా కనుక ఎవరి పనులు వారు చేసుకుంటే అందరికీ మంచిదని దిలీప్ సుంకర అన్నారు ఇక జనసేన ఊసు తనకు అనవసరమని కూడా అన్నారు. అలాగే తన ఊసు కూడా ఏ దూలగాడు తీయకుండా ఉంటే మంచిదని అన్నారు. నాలుగేళ్లు ఓ పీడకల అనుకుని మరిచిపోతానని అన్నారు. అంటానంటూ ఆయన అన్నారు.

 మరో పోస్టు ఇలా పెట్టారు...

మరో పోస్టు ఇలా పెట్టారు...

"నాకు పార్టీకి సంబంధం లేదని మీడియా చానెల్స్‌కి ఫోన్ చేసి చెప్పే మీడియా హెడ్ పి.ఆర్.ఓ వేణు. ఇదే ముక్క 48 గంటల్లో ప్రెస్ నోట్ ఇప్పిస్తే... ఈ జన్మలో జనసేన మొహం కూడా చూడను. ప్రెస్ నోట్ ఇప్పిచి నన్ను ఈ మానసిక వ్యధ నుండి విముక్తుడిని చేస్తే మీకు రుణపడి ఉంటా... నా బ్రతుకు నేను బ్రతుకుతా" అంటూ మరో పోస్టు పెట్టారు దిలీప్ సుంకర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+