ప్రైవేటు వైద్యం చేయాలనుకుంటే రాజీనామా చేయండి: కామినేని హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు నానాటికి తీసికట్టుగా మారిపోతున్నాయని.. లోపం ఎక్కడుందో ఆలోచించాలని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయంలో బుధవారం జరిగిన సూపరింటెండెంట్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి కామినేని పై వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మొదలు వైద్యశాఖలో పరిపాలన బాధ్యతలు చూస్తున్న వైద్యులు ఎవరూ కూడా అవుట్‌పేషంట్ సేవలు, ప్రైవేటు ప్రాక్టిస్ చేయడానికి అనుమతించేది లేదని మంత్రి కామినేని స్పష్టం చేశారు.
అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చని హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బోధన ఆస్పత్రుల్లో ఉన్న బయో మెడికల్ పరికరాల నిర్వహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

టిబిఎస్ ఇండియా టెలిమాటిక్ బయో మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది వ్యవధికి నిర్వహణకు రూ. 38.22 కోట్లు చెల్లించనుంది.
పోలవరం ఖర్చు వివరాలిస్తేనే నిధులు: ఏపీకి కేంద్రం సూచన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి ఇచ్చేందుకు ఆయా ఖర్చుల వివరాలను తమకు పంపాలని కేంద్రం కోరింది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు సంబంధించి వివరాలను కూడా ఆరా తీసింది.
ఆ నిర్మాణ సంస్థలు ఏయే పనులు చేపట్టాయో పూర్తి వివరాలివ్వాలని పేర్కొంది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమని, దానికి ఖర్చు చేసిన వ్యయాన్ని కూడా చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications