ఎవరైనా అభినందించాల్సిందే: పవన్‌పై మంత్రి కామినేని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంశించారు. ప్రజలకు మంచి చేయాలనుకునేవారు ఎవరైనా వారిని అభినందించాల్సిందేనని పవన్‌ను ఉద్దేశించి అన్నారు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంశించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చేందుకు హార్వర్డ్ బృందాన్ని వచ్చేలా పవన్ కృషి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు మంచి చేయాలనుకునేవారు ఎవరైనా వారిని అభినందించాల్సిందేనని పవన్‌ను ఉద్దేశించి అన్నారు మంత్రి.

ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌కు ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్, హార్వర్డ్ బృందం సోమవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమవుతారని అన్నారు.

kamineni srinivas praises Pawan Kalyan

ఉద్దానం సమస్యకు రాజకీయాలతో సంబంధం లేదని కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉద్దానం సమస్య పూర్తిస్థాయి పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.

ఉద్ధానం సమస్యను పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ప్రభుత్వం మరింత మెరుగైన సేవల కోసం చర్యలు తీసుకుందని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. హార్వార్డ్ బృందంతో భేటీ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ చర్చిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+