వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ జగన్ వరాలు: రెడ్డి, క్షత్రియ కులస్తుల కోసం కూడా..వేర్వేరుగా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. సంచలన నిర్ణయాలను తీసుకుంది. అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కమ్మ కులస్తులను కూడా ఇందులో చేర్చింది. అలాగే- వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తాయి.

 కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపే ఉన్నా..

కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపే ఉన్నా..


రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు దాదాపు తెలుగుదేశం పార్టీలోనే ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ సామాజిక వర్గానికి చెందిన 70 శాతం మందికి పైగా సుదీర్ఘకాలం నుంచీ టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ కమ్మ కులస్తుల మెజారిటీ ఓటుబ్యాంకు తెలుగుదేశానికి అండదండగా ఉంటూ వస్తోంది. గెలుపోటములకు అతీతంగా టీడీపీని ఆదరిస్తోంది.. అక్కున చేర్చుకుంటోంది. దీనికి కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు కావడం, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతం నుంచి రావడం ఒక కారణం.

చిల్లు పడుతుందా?

చిల్లు పడుతుందా?

రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఎదుర్కొనడానికి టీడీపీ రూపంలో వారికి ఒక అండ దొరికినట్టయిందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాంటి కమ్మ సామాజిక వర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్పొరేషన్ రూపంలో వరాలను కురిపించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా బలహీనులు లేకపోలేదు. ఆర్థికంగా, రాజకీయంగా పెద్దగా ఉనికిని చాటుకోలేని వారు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కమ్మ సామాజిక వర్గ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థికంగా చేయూతను అందించగలిగితే- వారు వైసీపీ వైపు మళ్లుతారనేది వైఎస్ జగన్ వ్యూహంగా ఉండొచ్చని అంటున్నారు.

రెడ్డి సామాజిక వర్గ సంక్షేమానికి..

రెడ్డి సామాజిక వర్గ సంక్షేమానికి..

రెడ్డి సామాజిక వర్గం ఓటుబ్యాంకు.. మొదటి నుంచీ వైఎస్ కుటుంబం వెంటే ఉంటోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణానికి గురయ్యేంత వరకూ వారు కాంగ్రెస్‌లో కొనసాగారు. వైఎస్సార్ కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి చాలామంది నేతలు కాంగ్రెస్‌లో తమదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రెడ్డి కులస్తులందరూ దాదాపు వైసీపీ వెంటే నడుస్తున్నారు. ఏపీలో మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే.. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం జనాభా అధికం. వారిలో ఆర్థికంగా వెనుకబడిన, చితికిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి.

క్షత్రియుల కోసం..

క్షత్రియుల కోసం..


పైగా- వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ..తమకు ఎలాంటి మేలు కలగలేదని, ఆదుకోవట్లేదనే భావన, అసంతృప్తి రెడ్డి సామాజికవర్గంలో ఉంది. దీన్ని రూపుమాపేలా రెడ్ల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. క్షత్రియ సామాజిక వర్గం సంక్షేమానికి ప్రత్యేకంగా మరో కార్పొరేషన్‌ను నెలకొల్పారు. ఈ మూడు సామాజిక వర్గాల్లో నెలకొన్న పేదరికాన్ని క్షేత్రస్థాయిలో రూపుమాపాలనే ఉద్దేశంతో సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ అనంతరాము ఈ మేరకు మూడు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు.

English summary
Andhra Pradesh government headed by Chief YS Jagan Mohan Reddy, have established the Kamma, Reddy, Kshatriya welfare and development Corporations for their communities respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X