అంతా అబద్దం: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిపై కనిమొళి సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై/అమరావతి: డీఎంకే నాయకురాలు, తమిళనాడు ఎంపీ కనిమొళి బుధవారం కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది మొక్కే తిరుమల వెంకటేశ్వర స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు కొలిచే దేవుడిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2G Spectrum Case : 2జీ స్పెక్ట్రమ్‌ కేసు : ఒకపక్క హర్షం, మరో పక్క విమర్శలు !

టెక్నాలజీతో 'అజ్ఞాతవాసి'పై అభిమానం: నెల్లూరులో పవన్ ఫ్యాన్స్ గొడవకు డీఎస్పీ చెక్!

పేదవాడిని కాపాడలేని దేవుడు మనకు ఎందుకని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని కొందరు నీతులు చెబుతుంటారని, కానీ అదంతా వట్టిదేనని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ సమానం అనేది వాస్తవం కాదని చెప్పారు.

డబ్బున్న వారికే దేవుడు

డబ్బున్న వారికే దేవుడు

వాస్తవానికి డబ్బులు బాగా ఉన్న వారే దేవుడి వద్దకు ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్తున్నారని కనిమొళి అన్నారు. డబ్బులేని వారికి రోజులపాటు పడిగాపులు తప్పవని ఆమె అక్కసు వెళ్లగక్కారు.

 కోటీశ్వరులకే ఆయన దేవుడు

కోటీశ్వరులకే ఆయన దేవుడు

కోట్లాది రూపాయలు ఇచ్చే కోటీశ్వరులకే ఆయన దేవుడు అని కనిమొళి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బుంటేనే ప్రత్యేక దర్శనం అని చెప్పారు. తన సొంత హుండీని కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు.

కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తారు కాబట్టి

కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తారు కాబట్టి

కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తారు కాబట్టి ఆయన కోటీశ్వరులకే దేవుడు అని కనిమొళి వ్యాఖ్యానించారు. పేదవాడిని కాపాడలేని దేవుడు అక్కరలేదని ఆమె అన్నారు.

 కనిమొళి కలకలం

కనిమొళి కలకలం

ఇదిలా ఉండగా, కనిమొళి వ్యాఖ్యలు కలకలం రేపే అవకాశముంది. కోట్లాది మంది శ్రీవారిని మొక్కుతారు. రోజుకు లక్షలాది మంది దర్శించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన దర్శనం కోసం వస్తారు. పాలకులు పేదవారిని డబ్బున్నవారిని వేర్వేరుగా చూస్తారేమో.. కానీ దేవుడు అలా కాదని అంటున్నారు. దేవుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMK leader and Tamil Nadu MP Kanimozhi shocking comments on Tirumala on wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి