కన్నా లక్ష్మీనారాయణ - రాయపాటి రాజీ..!!

ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఎట్టకేలకు రాజీ పడ్డారు. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కీలక పదవుల్లో కొనసాగిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ..మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజకీయ ప్రత్యర్ధులుగా వ్యవహరించేవారు. 2010లో కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడుతున్నారంటూ నాడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాయపాటి ఆరోపించారు. దీని పైన కన్నా కోటి రూపాయాలకు రాయపాటి పైన పరువు నష్టం దావా దాఖలు చేసారు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది.

2014 రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో రాయపాటి టీడీపీలో చేరి 2014లో టీడీపీ నుంచి నర్సరావు పేట ఎంపీగా గెలుపొందారు. కన్నా ఆ తరువాత కొంత కాలానికి బీజేపీలో చేరారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పైన వ్యాఖ్యలు చేయటంతో ఆయన వార్తల్లో నిలిచారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నేతలు కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాం గోపాల్ ఈ కేసులో ఇద్దరు నేతలను కోర్టుకు హాజరు కావాలని సూచించారు.

Kanna Lakshmi Narayana and Ex mp Rayapati compramise in defamation case in Guntur

వారిద్దరితో ఇద్దరూ సీనియర్ నేతలు.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు. స్వల్ప విషయాలకు కేసులు పెట్టుకొని కోర్టుకు వస్తే ఇతరులకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఒక సారి ఆలోచించాలని సూచించారు. రాజీ ద్వారా సమస్యకు సామరస్య పూర్వకంగా ముగింపు పలికితే మంచిదని హితవు పలికారు. ఇద్దరూ రాజీ చేసుకోవటానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఇద్దరు నేతలు అంగీకరిస్తూ సరే అన్నారు. ఇద్దరు నేతలను న్యాయమూర్తి తన ఛాంబర్ లోకి పిలిచి రాజీ చేయటంతో, ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. రాజీ సమయంలోనే తన ఆరోపణల వలన కన్నా లక్ష్మీనారాయణ బాధ పడిఉంటే వాటిని తాను ఉపసంహరించుకుటున్నానని చెప్పారు.

అదే సమయంలో తాను దావాలో చేసిన ఆరోపణలకు రాయపాటి బాధ పడి ఉంటే తానూ ఉపసంహరించుకుంటున్నానని కన్నా పేర్కొంటూ కోర్టులో జాయింట్ మెమో దాఖలు చేసారు. ఒక పైనా పరస్పరం వ్యాఖ్యలు చేసుకోబోమంటూ పేర్కొన్నారు. దీంతో, కేసును కొట్టివేసిన న్యాయమూర్తి రాజీ మార్గంలో వివాదాలు పరిష్కరించుకోవటం ద్వారా సమయం..ధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు రాజీ పడటంతో, రాజకీయంగానూ రానున్న రోజుల్లో కొత్త సమీకరణాలకు నాందిగా పొలిటికల్ సర్కిల్స్ గా చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+