రూటు మార్చేసిన కేశినేని నాని..! అదను చూసి సర్కార్ పై దాడి మొదలు..!

విజయవాడకు రెండుసార్లు ఎంపీగా పనిచేసి, గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎంపీగా ఓడిపోయిన కేశినేని నాని (Kesineni Nani) ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా రాజకీయ నేతల్ని కలుస్తున్నా తిరిగి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని చెప్తూ వస్తున్నారు. కానీ తాజాగా సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నితో జరుగుతున్న పోరులో సీఎం చంద్రబాబు సహకారం అడిగినా ఫలితం లేకపోవడంతో కేశినేని రూటు మార్చారు.

కేశినేని నానికి ఎంపీ చిన్ని షాక్..! ఆదుకోని చంద్రబాబు పోస్ట్..!
కేశినేని నానికి ఎంపీ చిన్ని షాక్..! ఆదుకోని చంద్రబాబు పోస్ట్..!

విజయవాడలో తాజాగా చోటు చేసుకున్న రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ తీవ్ర సంచలనం రేపుతోంది. విజయవాడ కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను ప్రకాశం జిల్లా నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చి మరీ లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని సైతం మాయం చేసారన్న వార్తలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయికృష్ణ చావుకు కారణమైన కృష్ణలంక సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణకు సైతం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని రంగంలోకి దిగారు.

Back With a Bang Kesineni Nani Demands Vijayawada CP s Head Over Lockup Death Haunts Chandrababu
కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?
కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?

విజయవాడ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ కేశినేని నాని ఘాటు ట్వీట్ పెట్టారు. విజయవాడలో పోలీసు రాజ్!!!
లాకప్‌లో అనుమానాస్పద మరణంపై ఉన్న మచ్చలను బదిలీలు చెరిపివేయలేవు! అంటూ కేశినేని ట్వీట్ చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును విజయవాడకు బదిలీ చేయడం ఒక మామూలు కప్పిపుచ్చుకునే చర్య అని, గడే సాయి కృష్ణ (26) నేరస్థుడే కావచ్చు, కానీ శిక్షను పోలీస్ స్టేషన్లు కాకుండా కోర్టులే నిర్ణయించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుందని గుర్తుచేశారు.

Back With a Bang Kesineni Nani Demands Vijayawada CP s Head Over Lockup Death Haunts Chandrababu

మే 9 నుంచి 35 రోజులకు పైగా అక్రమ నిర్బంధంలో ఉంచడం వల్లే కస్టడీలో మరణం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, కస్టడీ కాదని పోలీసులు ఖండిస్తున్నారని కేశినేని తెలిపారు. ఏపీ హైకోర్టు దీనిపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ, జూన్ 29 లోగా అధికారులను హాజరుపరచాలని లేదా వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో తక్షణమే జవాబుదారీతనం అవసరమని తెలిపారు. పారదర్శకమైన న్యాయ విచారణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) జోక్యం జరిగే వరకు సీపీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. సాయి కృష్ణను హాజరుపరచాలని లేదా ఏం జరిగిందో వివరించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+