సూపర్ హిట్‌కి సీక్వెల్ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే..?

తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ "Save The Tigers". మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన వినోదాన్ని పంచేందుకు సీజన్ 3 సిద్ధమైంది. ఈ సిరీస్ గ్రాండ్ ప్రీమియర్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ AMB సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. చిన్న తెర నుంచి వెండితెర వరకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు విచ్చేయడంతో థియేటర్ ప్రాంగణమంతా తారల తళుకులతో మెరిసిపోయింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై సెలబ్రిటీలు హై-ఫ్యాషన్ లుక్స్‌లో తళుక్కున మెరిశారు. ఎక్స్‌క్లూజివ్ మీడియా ఇంటరాక్షన్లు, ప్రీ-స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్‌తో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ వేడుకలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, కిరీటి దామరాజు, నిరుపమ్, మానస్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు బిగ్ బాస్ విజేతలు వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తమ నవ్వులతో, సందడితో సాయంత్రాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేశారు.

Save The Tigers Season 3 Grand Premiere Celebrities Roar at AMB Cinemas

మూడు భిన్నమైన జంటల కథతో, భార్యాభర్తల మధ్య జరిగే వినోదాత్మక పోరాటమే ఈ సిరీస్ ముఖ్య కథాంశం. స్క్రీనింగ్ ముగిసిన తర్వాత సెలబ్రిటీల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డిల పెర్ఫామెన్స్ నవ్వుల పూలు పూయించింది. వీరికి తోడుగా వర్సటైల్ యాక్టర్ వెన్నెల కిషోర్ పోషించిన ప్రత్యేక పాత్ర ఈ సీజన్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచిందని, ఆయన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించిందని అతిథులు ప్రశంసించారు. రోహిణి పాత్ర కూడా ఆకట్టుకుందని టాక్.

తెలుగు వెబ్ సిరీస్ చరిత్రలోనే వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ సిరీస్, ఈసారి మరింత క్రేజీగా ఉండబోతోంది. మొదటి రెండు సీజన్స్‌లోని క్యారెక్టరైజేషన్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కంటిన్యూ చేస్తూనే.. ఈ మూడో సీజన్‌లో ఒక సరికొత్త ఫ్యాంటసీ ట్విస్ట్‌ను జోడించినట్లు మేకర్స్ తెలిపారు. ఇది ప్రేక్షకుల్లో ఉత్కంఠను , వినోదాన్ని రెట్టింపు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కౌంట్‌డౌన్‌కు సమయం ఆసన్నమైంది. సెలబ్రిటీల ప్రశంసలు అందుకున్న "సేవ్ ది టైగర్స్ సీజన్ 3", జూన్ 19 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. వీకెండ్‌లో కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకోవడానికి టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు, సిద్ధంగా ఉండండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+