టీడీపీలోకి కన్నా ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ - చంద్రబాబు హామీ..!?
చంద్రబాబు హామీతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ అయింది.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక ఖరారైంది. ముహూర్తం ఫిక్స్ అయింది. బీజేపీకి రాజీనామాకు ముందే టీడీపీ నాయకత్వంలో చర్చలు...ఒప్పందం జరిగినట్లు సమాచారం. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత వరుసగా తన అనుచర వర్గంతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ - జనసేన నుంచి ఆఫర్ ఉందని అనుచరవర్గం చెబుతోంది.
తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించినా కొన్ని ప్రత్యేక కారణాలతో టీడీపీలోకి కన్నా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఉందని సమాచారం. టీడీపీతో దాదాపు రెండున్నార దశాబ్దాల రాజకీయ పోరాటం చేసిన కన్నా లక్ష్మీనారాయణ పచ్చ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్దమైంది.

టీడీపీలోకీ ఈ నెల 23న ఎంట్రీ
బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. కొత్తగా ఏ పార్టీలో చేరాలనే అంశం పైన చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసారు. తారకరత్న మరణంతో నిర్ణయాలు ఏవీ ప్రకటించకుండానే సమావేశం ముగించారు. తారకరత్న మరణం పట్ల కన్నా సంతాపం ప్రకటించారు. ఇప్పటికే కన్నా టీడీపీలో చేరటం ఖాయమైంది.
బీజేపీ వీడాలని నిర్ణయించిన తరువాత తొలుత జనసేనతో సంప్రదింపులు జరిగాయాని సమాచారం. బీజేపీతో ఇంకా జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ..బీజేపీ లో కీలక నేతగా ఉన్న కన్నాను చేర్చుకోవటం సరి కాదనే అభిప్రాయంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో..భవిష్యత్ పొత్తు కాయమని భావిస్తుండంతో ఇప్పుడు టీడీపీలో చేరాలని కన్నా డిసైడ్ అయ్యారు.

చంద్రబాబు నుంచి హామీ
కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీ మధ్నాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కన్నాతో ఆయన ముఖ్య అనుచరవర్గం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. కన్నా గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా వ్యవహరించారు.
2014,2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో ఆయనకు రెండు సీట్ల పైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి కన్నా టీడీపీ అభ్యర్దిగా నిలబడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ -జనసేన సీట్ల పంపకాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సమాచారం.

మారుతున్న రాజకీయ సమీకరణాలు
బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అనూహ్యంగా కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి బలం చేకూరింది. కాంగ్రెస్ లో దాదాపు రెండున్నార దశాబ్దాలు పని చేసిన కన్నా..టీడీపీ పైన రాజకీయంగా పోరాటం చేసారు. ఇప్పుడు టీడీపీ లో ఎంట్రీతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి కన్నా రాక పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే, చంద్రబాబు హామీతోనే కన్నా టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. కన్నా చేరికకు ముందే జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీంతో..ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ అధికారికంగా టీడీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications