అంత ద్వేషమా? తప్పుడు ప్రచారాలు ఆపండి: చంద్రబాబు, మీడియాపై కన్నా నిప్పులు
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడారని మండిపడ్డారు.
Recommended Video


తప్పుడు ప్రచారం ఆపండి..
కేంద్రం అఫిడవిట్లపై చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రైల్వే జోన్ ఇవ్వట్లేదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, రైల్వే జోన్ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ కూడా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు.

మీడియాకు కూడా అంత ద్వేషమా?
కేంద్రం తన అఫిడవిట్లలో స్టేటస్ మాత్రమే తెలిపిందని చెప్పారు. తప్పుడు రాతలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదంటూ ప్రింట్ మీడియాకు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ఎందుకంత ద్వేషం, విషం కక్కుతున్నారని మండిపడ్డారు.

బాబుతోపాటు మీడియా కూడానా?
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీనే పార్లమెంటులో చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. టీడీపీ రాజకీయ లబ్ధి కోసం దురుద్దేశంతో బీజేపీ, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోందని కన్నా మండిపడ్డారు. అయితే, పత్రికలు కూడా ఎందుకు దురుద్దేశంగా ప్రవర్తిస్తున్నాయని ప్రశ్నించారు. తమపై అంత కోపం వద్దని సూచించారు. ఏపీకి అన్యాయం చేయమని అన్నారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లే..
చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయన్నారు. చంద్రబాబుకు ప్రధానిని విమర్శించే స్థాయి లేదని, హిందుత్వం అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. శివస్వామిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కన్నా ఆరోపించారు.












Click it and Unblock the Notifications