కప్పట్రాళ్ల హత్య కేసు: 21 మందికి జీవిత ఖైదు

2008 మే 17వ తేదీన కప్పట్రాళ్లతో పాటు మరో పదిమందిని హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల్లో నలుగురిని ప్రత్యర్థులు హత్య చేశారు. అనారోగ్యంతో ముగ్గురు సబ్ జైలులలో మృతి చెందారు. ఇప్పుడు కోర్టు 46 మందికి శిక్ష విధించింది. నాలుగో నిందితుడు పరారీలో ఉన్నాడు.
కాగా, కప్పట్రాళ్ల వెంకప్పనాయుడు ప్రముఖ ఫ్యాక్షన్ నేత, టీడీపీ నాయకుడు. కప్పట్రాళ్ల హత్య కేసులో తీర్పు నేపథ్యంలో ఆదోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
2008 మే 17న దేవనకొండ మండలం కప్పట్రాళ్ల నుంచి ఫ్యాక్షన్ నేత వెంకటప్పనాయుడు, అన్న కుమారుడు పి శివశంకర్‌నాయుడు, అనుచరులు శివన్నగౌడ్, మాల చెన్నకేశవుడు, మఠం వెంకోబరయ్యతో పాటు మరో ఆరుగురు ఏపీ 21 ఎం 8434 వాహనంలో కోడుమూరుకు బయలుదేరగా కొత్త బోదేపాడు బస్టాప్ దగ్గర ప్రత్యర్థులు వారి వాహనంపై బాంబులేసి మారణాయుధాలతో హత మార్చారు.
ఈ కేసులో కప్పట్రాళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దిలేటి నాయుడు, వారం పద్మక్క, దివాకర్‌నాయుడు, యోగేశ్వర్‌నాయుడు, పురుశోత్తమనాయుడు, ప్రభాకర్ గౌడ్, రమేష్‌తోపాటు 46 మంది వివిధ వాహనాల్లో వచ్చి దాడి చేసి హతమార్చారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై దాదాపు ఆరు సంవత్సరాలపాటు ఆదోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ సాగింది. సాక్షులను విచారించిన న్యాయస్థానం తుది తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు నేపథ్యంలో దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లతో పాటు ఆయా గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది.
కప్పట్రాళ్ల, జిల్లెలబుడకల, నేలతలమర్రి, భైరవానికుంట, కె.వెంకటాపురం గ్రామాల్లో పోలీసు తనిఖీలు నిర్వహించి నలుగురు అనుమానితులను దేవనకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఐ గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి ఎస్‌ఐలు ప్రియతంరెడ్డి, సీవీ నరసింహులు, రహంతుల్లా, జి చంద్ర బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications