కాపు ఐక్య గర్జన: చిచ్చు పెడుతారా, వెళ్తారా? (పిక్చర్స్)

విజయవాడ: తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, కాపు సంఘం నాయకుడు ముద్రగడ పధ్మనాభం ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదిన తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహిస్తున్న కాపు ఐక్య గర్జనకు భారీ స్పందన వస్తున్నది. స్వచ్చందంగా కాపు ఐక్య గర్జనకు వెళ్లాలని రాయలసీమలోని కాపు కులస్తులు (బలిజ) ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పార్టీలకు అతీతంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్న వారి వాహనాలలో వెళ్లడానికి చాల మంది సిద్దం అయ్యారు. కాపు ఐక్య గర్జన సభ విజయవంతం చేసి గత శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని కాపు కులస్తులు నిర్ణయించారు.

అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పలు చోట్ల తమను నమ్మాలని, తాము కాపు కులస్తులకు న్యాయం చేస్తాం, దయ చేసి మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కాపు ఐక్య గర్జన సభకు వెళ్లరాదని చెబుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

చెప్పిన హామీలు నేరవేర్చాలి

చెప్పిన హామీలు నేరవేర్చాలి

ఎన్నికల సందర్బంలో కాపులను బీసీల్లో చేరుస్తామని తెలుగు దేశం పార్టీ హామి ఇచ్చింది. ఇచ్చిన హామీని గడువులోగా నెరవేర్చాలని ముద్రగడ పధ్మనాభం డిమాండ్ చేస్తున్నారు.

బీసీ కార్పొరేషన్

బీసీ కార్పొరేషన్

కాపుల కోసం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ. ఐదు వేల కోట్ల కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.

ఆలస్యం చేస్తున్న అధికార పార్టీ

ఆలస్యం చేస్తున్న అధికార పార్టీ

కాపుల డిమాండ్ల విషయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కాలం వెళ్లదీస్తున్నారు. కాపులను మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.

అధికార పార్టీ నాయకులు

అధికార పార్టీ నాయకులు

తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాస రావు, నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ), టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, నాయకులు చదలవాడ సుచరిత, డీకే సత్యప్రభ, పాలకోండ్రాయుడు తదితరులు ఉన్నారు.

చిరంజీవి

చిరంజీవి

కాంగ్రెస్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, సీ. రామచంద్రయ్య, సాయిప్రతాప్ తదితరులు ఉన్నారు.

అభిమానులకు పిలుపునివ్వలేదు

అభిమానులకు పిలుపునివ్వలేదు

కాపు ఐక్య గర్జన సభకు మెగా అభిమానులు వెళ్లాలని కనీసం చిరంజీవి ఇప్పటి వరకు పిలుపునివ్వలేదని కాపు కులస్తులు మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ అంతే

పవన్ కళ్యాణ్ అంతే

బీజేపీ, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు విసృతంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం నోరు విప్పడం లేదని కాపు సంఘం నేతలు అంటున్నారు. కాపుల హక్కుల కోసం వీరు పోరాటం చెయ్యరని పరోక్షంగా మండిపడుతున్నారు.

దాసరి వస్తారని నమ్మకం

దాసరి వస్తారని నమ్మకం

కేంద్ర మాజీ మంత్రి, దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కాపు ఐక్య గర్జనకు వస్తారని కాపు కులస్తులు అంటున్నారు.

వైఎస్ఆర్ సీపీ వింతపోకడ

వైఎస్ఆర్ సీపీ వింతపోకడ

ముద్రగడ పధ్మనాభంతో మాకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయని, అయితే కాపు ఐక్య గర్జనకు వెళ్లాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించామని వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు.

వైసీపీలో కాపులు

వైసీపీలో కాపులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మహాలక్ష్మి శ్రీనివాస్, నవీన్ నిశ్చల్ తదితరులు ఉన్నారు.

అనుమతి ఇచ్చాం, ఆంక్షలు లేవు

అనుమతి ఇచ్చాం, ఆంక్షలు లేవు

కాపు ఐక్య గర్జన సభకు అనుమతి ఇచ్చామని, ఎలాంటి ఆంక్షలు విధించలేదని పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+