బీజేపీలోకి ముద్రగడ..!!? కండిషన్స్ అప్లై : టార్గెట్ జగన్..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరుతున్నారా. పార్టీ జాతీయ నేత ఆయనతో సంప్రదింపులు జరిపారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. టీడీపీ..వైసీపీకి భిన్నంగా ఏపీలో సామాజిక సమీకరణాలతో ఎదగాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు ముద్రగడ ద్వారా కాపు వర్గానికి దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. కొద్ది రోజులుగా పవన్ సైతం ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా మీద ప్రశంసలు కురిపిస్తూ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ బలహీన పదిందని అంచనా వేస్తున్న బీజేపీ..ఇక ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తోంది. అందులో బాగంగా కాపు వర్గానికి తమ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. దీంతో..కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. అయితే..ముద్రగడ రిజర్వేషన్ల అంశం మీద సానుకూలంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన హామీ వస్తే ముద్రగడ బీజేపీలో చేరటం లాంఛనమే.
ముద్రగడతో టచ్ లో బీజేపీ నేతలు..
ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం..కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ..వైసీపీ లకు ప్రధానంగా అండగా నిలిచే రెండు వర్గాల కంటే భిన్నంగా కాపులను దగ్గర చేసుకోవలాని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే పార్టీలో సీనియర్లను సైతం కాదని తొలి అడుగుగా కన్నా లక్ష్మీ నారాయణకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించింది. ఇక, ఇప్పటికే చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించటం..మంతనాలు జరిపినా ఆయన నుండి సానుకూల సంకేతాలు రాలేదు. చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాలతో బీజీగా ఉన్నారు. ఇక, గతంలో బీజేపీ పైన ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ తో తానా వేడుకల వేదికగా బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ చర్చలు చేసారు. ఆ తరువాత పవన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రధాని మోదీ..అమిత్ ను ఈ మధ్య కాలంలో పవన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జనసేనను మాత్రం బీజేపీలో విలీనం చేయనని పవన్ తేల్చి చెప్పేసారు. దీంతో..పవన్ తో మైత్రి కొనసాగిస్తూనే కాపు వర్గానికి చెందిన ముఖ్య నేతలను బీజేపీ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే..విశాఖ కు చెందిన మాజీ మంత్రి ఆయన వియ్యంకుడు సైతం బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసారు. అయితే ఆ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో అనర్హత వేటు పడుతుందనే కారణంగా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Recommended Video

బీజేపీ అసలు లక్ష్యం సీఎం జగన్...
ఏపీలో రాజకీయాలు పూర్తిగా కుల సమీకరణాల మీద ఆధార పడి నడుస్తున్నాయి. ఇటువంటి సమీకరణాల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మంచి దిట్ట. ఆయన మార్గదర్శకంలోనే ఏపీలో కాపు నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు. పవర్ కళ్యాణ్ మద్దతు.. పార్టీలో ముద్రగడ..కన్న వంటి వారి ద్వారా కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహం. ఇందులో ప్రధానంగా టీడీపీకి గత ఎన్నికల్లో కాపులు దూరమయ్యారు. పవన్..జగన్ ఇద్దరూ కాపుల మద్దతు పొందారు. జగన్ కు భవిష్యత్ లో కాపుల మద్దతు లేకుండా చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాపు నేతలతో పాటుగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో రాయలసీమలో జగన్ కు అండగా నిలిచే మరో ప్రధాన వర్గానికి చెందిన నేతలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఈడబ్ల్యుుయస్ కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు చేసిన నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని పైన టీడీపీ నేతలు కంటే బీజేపీ నేతలే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ల అంశం మీద చంద్రబాబు విఫలమవ్వటం..జగన్ హమీ ఇవ్వకపోవటంతో దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో ముద్రగడతో మంతనాల సమయంలోనూ ఆయన సైతం ఇదే అంశం పైన స్పష్టత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీని పైన బీజేపీ వైఖరి స్పష్టం చేస్తే ముద్రగడ బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications