Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్తపల్లితో ముద్రగడ భేటీ- వైసీపీ సస్పెన్షన్ తరువాత : తెర వెనుక ఏం జరుగుతోంది..!!

గోదావరి జిల్లాల వేదికగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో అనూహ్య మెజార్టీ సాధించిన వైసీపీ పైన ఇప్పుడు పట్టు కోల్పోతుదంటూ రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ ఇక ఉభయ గోదావరి జిల్లాలపైన ఆశలు వదులుకోవాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. వైసీపీలో ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ రఘు రామ రాజు..తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తీరు పార్టీకి ఇబ్బందిగా మారింది.

ముద్రగడతో భేటీ వెనుక

ముద్రగడతో భేటీ వెనుక


దీంతో..నర్సాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ అధినాయకత్వం కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తన సస్పెన్షన్ పైన సుబ్బారాయుడు తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేయటానికి కారణాలు ఏంటి.. ఎవరు ఫిర్యాదు చేసారంటూ ప్రశ్నించారు. దానికి ముందుగా ఆయన గన్ మెన్లను తొలిగించారు. అయితే, ఆకస్మికంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ సస్పెండెడ్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడుతో సమావేశమయ్యారు. ఇద్దరూ రెండు గంటల పాటు బేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బీసీ సంఘాల నేతలు ముద్రగడతో మంతనాలు సాగించారు. కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు పైన చర్చించారు.

గోదావరి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు

గోదావరి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు


అదే సమయంలో కాపు ఉద్యమ నాయకత్వం నుంచి ముద్రగడ విరామం తీసుకున్నారు. తన పైన వచ్చిన విమర్శల కారణంగా ఉద్యమ నాయకత్వానికి ముద్రగడ దూరంగా ఉంటున్నారు. అయితే, గతంలో పలు పార్టీల్లో పని చేసిన కొత్తపల్లికి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన వైసీపీలో కొనసాగే పరిస్థితులు లేకపోవటంతో తిరిగి ఇప్పుడు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇక, ఎన్నికల సమయానికి ముద్రగడ సైం రాజకీయంగా తన పట్టు నిరూపించుకొనే ప్రయత్నాల్లో భాగంగా..అందరినీ కలుపుకొని బలం చాటే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారమూ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

జగన్ బలం పైనే పార్టీల ఫోకస్

జగన్ బలం పైనే పార్టీల ఫోకస్

ప్రధాన రాజకీయ పార్టీల మద్య పొత్తు వ్యవహారం పైన అనేక రకాల సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో..రానున్న ఎన్నికల సమయానికి గోదావరి జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో కీలకంగా మారనున్నాయి. ఇక, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే అంచనాల్లో పార్టీల నేతలు ఉన్నారు. దీని పైన ఒక స్పష్టత వచ్చిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణాల్లో వేగంగా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ముద్రగడ - కొత్తపల్లి సమావేశం కాపు వర్గాల్లోనూ.. రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి కర చర్చకు కారణంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+