గోరంట్ల నివాసంలో ముద్రగడ మంతనాలు!.. ఏం జరగబోతోంది? ముద్రగడ టీడీపీలో చేరతారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ముద్రగడ సమావేశమయ్యారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాపు సామాజికవర్గంలో ఎంతో కొంత పట్టు ఉన్నటువంటి ముద్రగడను.. తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడుతుందనే భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

Kapu Movement Leader Mudragada Padmanabham in TDP MLA Gorantla Buchaiah Chowdary House

ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు టీడీపీపై కాపుల వ్యతిరేక ప్రభావం లేదనే సంకేతాన్ని ఇచ్చాయి. ఈ ఎన్నికల తర్వాత కాపు శ్రేణుల్లో ఈ విషయమై విస్తృతమైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

అలాగే.. చంద్రబాబు పాలనలో తమ సామాజిక వర్గానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనే భావన కాపు శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకునే ఉద్దేశంలో చంద్రబాబు లేరని, ఆయనతో సయోధ్యగా ఉంటే తమ కులానికి మరింత మేలు జరుగుతుందని కాపు ఉద్యమ నేతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kapu Movement Leader Mudragada Padmanabham went to TDP Senior Leader, MLA Gorantla Buchaiah Chowdary House. There he met BJP MLA Akula Satyanarayana also. According to sources, discussions are going between the leaders towards the joining of Mudragada into TDP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి