తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడేది అప్పుడే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం వెనకడుగు వేయటం లేదు. కూటమి ప్రభుత్వం ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యార్థుల తల్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే "తల్లికి వందనం" పథకాన్ని త్వరితగతిన పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీలో తల్లికి వందనం త్వరలో

అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జమ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలోనే రాబోయే జూలై నెలలో లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కొన్ని కీలక మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చింది.

Good news on thalliki vandanam scheme Eligible school students mothers will get Rs 15 000 in July

నిరుపేద కుటుంబాలపై చదువుల భారం తగ్గించే పథకం

గతంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కేవలం ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందేది. కానీ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు బడికి వెళ్తున్నా, అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి విడివిడిగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. దీనివల్ల నిరుపేద కుటుంబాలపై చదువుల భారం గణనీయంగా తగ్గనుంది.

విద్యార్థుల, తల్లుల వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ

ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల వివరాలను, వారి తల్లుల ఆధార్ మరియు బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. జూన్ నెలలోనే 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో, ఈ డేటా వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకమైన నిబంధనలను రూపొందిస్తున్నారు.

ఏపీకి కేంద్రం పెద్దపీట.. ఆ పథకంలో అత్యధిక నిధులు సాధించిన మూడో రాష్ట్రంగా ఏపీ
ఏపీకి కేంద్రం పెద్దపీట.. ఆ పథకంలో అత్యధిక నిధులు సాధించిన మూడో రాష్ట్రంగా ఏపీ

సీఎం చేతుల మీదుగా తల్లుల ఖాతాల్లోకి నగదు బదిలీ అప్పుడే

జూలై మొదటి లేదా రెండవ వారంలోగా తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, అదే నెలలో నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదును బదిలీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+