'తరిమి కొడ్తాం.. సీఎం పాపం చేస్తున్నారు, బాబులో మార్పురాలేదు'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో గుడులను కూలగొట్టి పాపం పనులు చేస్తున్నారని, మా ఇళ్ల పైన కూడా పడ్డారని, పాత చంద్రబాబు బయటకు వచ్చారని, ఆయనలో మార్పు రాలేదని విజయవాడ కరకట్ట వాసులు మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ దెబ్బకు బాబు కార్నర్!: చిరు సహా ఎవరికీ తప్పడం లేదా?

కృష్ణా కరకట్ట పరిరక్షణ సమితి ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో కరకట్ట వాసులు పాల్గొన్నారు. కరకట్ట పైన ఉన్న తమ ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరకట్ట పైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు.

గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, టిడిపి నేతలు వచ్చి కరకట్ట వాసులకు హామీ ఇచ్చారని, మా ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తుందని నమ్మించారని, దీంతో తాము ఓట్లు వేశామని చెప్పారు. ఇప్పుడు తమ ఇళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు.

babu

గతంలో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ ఇంటిని తీసేస్తే మా ఇంట్లో ఉండమని చెప్పారని, ఇప్పుడు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. టిడిపి నేతలు నాటకాలు ఆడవద్దన్నారు. కరకట్ట పైన ఉన్న ఒక్క ఇంటి జోలికి వచ్చినా ఊరుకునేది లేదన్నారు.

సింగపూర్ ప్రాజెక్టుల కోసమా.. బాబు మారలేదు

సింగపూర్ ప్రాజెక్టుల కోసం మా ఇళ్లు తీసేస్తున్నారా అని ధ్వజమెత్తారు. విదేశీ కంపెనీల కోసం మా ఇళ్లు తొలగించడం ఏమిటన్నారు. చంద్రబాబు మారలేదని, పాత చంద్రబాబు బయటకొచ్చారన్నారు. ఆయన రష్యా, కజకిస్తాన్ అని తిరుగుతుంటే, ఇక్కడ మాత్రం ఇళ్లను తీసేయాలా అని ప్రశ్నించారు.

టి నుంచి ఏపీ కాపీ, 5గురు కీలకం: టీసీఎస్ సిబ్బంది విచారణ

తరిమి కొడతాం.. ఖబడ్దార్

ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకోవాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఇళ్లను తొలగించేందుకు వస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఖభడ్దార్ అని హెచ్చరించారు. మా ఇళ్ల జోలికి వస్తే తగిన శాస్తి చేస్తామన్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు సిద్ధమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karakatta dwellers oppose demolition of houses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి