విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రళయం సృష్టించైనా ప్రత్యేక హోదా సాధిస్తాం: శివాజీ, 'చంద్రబాబు పాలన చేయకుండా బిజినెస్ చేస్తున్నారు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన డిమాండ్ కోరుతా విపక్షాలు, లెప్ట్ పార్టీలు తన నిరసనను కొనసాగిస్తూనే ఉన్నాయి. మంగళవారం మాలమాహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రళయం సృష్టించైనా ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోడీ వైఖరికి నిరసనగా బుధవారం నుంచి ఏపీలో బీజేపీ కార్యాలయల ముట్టడికి పిలుపునిచ్చారు. టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న చిన్న సమస్యలపై కాకుండా ప్రత్యేక హోదాపై మాట్లాడాలని కారెం శివాజీ సూచించారు.

Karam Shivaji reacts on AP Special Status at vijayawada

కార్పోరేట్ కంపెనీలకు భూమిని కట్టేబెట్టే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై మాటమార్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర మంత్రులు దొంగనాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేయకుండా బిజినెస్ చేస్తున్నారన్నారు. ముఖ్ధుం భవన్‌లో లెఫ్ట్ పార్టీల సమావేశం ముగిసింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్‌కు మద్దుతు ప్రకటించారు. 28న విజయవాడలో విద్యుత్ అమరవీరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించనున్నారు. 30వ తారీఖున సీఆర్‌డీఏ పరిధిలో లెప్ట్ నేతలు పర్యటించనున్నారు.

వచ్చే నెల 11, 12 తేదీల్లో కరవు ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీ నేతలు పర్యటించనున్నారు. ఇక బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా 14, 15 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరంలో ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

English summary
Karam Shivaji reacts on AP Special Status at vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X