కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పవన్ - అక్కడే అసలు ట్విస్ట్..!?

జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో కొనసాగుతారా. కటీఫ్ చెప్పి టీడీపీతో కలుస్తారా. త్వరలోనే ఈ విషయం తేలిపోనుంది. కర్ణాటకలో ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్కడ అధికారం కోసం బీజేపీ అన్ని అస్త్రాలను ఎక్కు పెడుతోంది. ప్రచారంలో పాల్గొనే వారి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పుడు బీజేపీ కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి.

బీజేపీ ప్రచారానికి పవన్ వెళ్తారా : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ సేవలు వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. 2014 పొత్తులు రిపీట్ చేద్దామని ప్రతిపాదించారు.

వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పని చేస్తున్నామని..తమ రెండు పార్టీలతో పాటుగా టీడీపీని కలుపుకు వెళ్తామని బీజేపీ ముఖ్య నేతల ముందు ప్రస్తావించారు. ప్రస్తుతం పార్టీ ఫోకస్ అంతా కర్ణాటక మీద ఉందని, అక్కడ ఎన్నికలు పూర్తయిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపైన నిర్ణయాలు ఉంటాయని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు సమాచారం.

pawanpooja

బీజేపీ నేత వరుస భేటీలు : ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయాలని బీజేపీ యువమోర్చా నేత, ఎంపీ తేజస్వీ సూర్య కోరారు. తొలి నుంచి పవన్ కల్యాణ్ - తేజస్వీ సూర్య మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు సార్లు పవన్ - తేజస్వీ భేటీ జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం పైనే ఈ సమావేశాలు జరిగినట్లు సమాచారం.

కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బాగేపల్లి, చిక్ బళ్లాపూర్, బెంగుళూరు సిటీ, కోలార్ లలో పవన్ ను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. మే 8వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం సాగనుంది. దీని పైన పవన్ తన షెడ్యూల్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే సమయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

pawanpooja

పవన్ ఏం చేయబోతున్నారు : బీజేపీకి బెంగుళూరు నగరంలో ముఖ్య నేతగా ఉన్న తేజస్వీ పేరు బీజేపి స్టార్ కాంపెనైర్ల జాబితా లో లేదు. దీంతో, ఇప్పుడు పవన్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏపీ - తెలంగాణ బీజేపీ నేతలతోనూ పవన్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉణ్నాయి. 2018 ఎన్నికల సమయంలోనూ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ దూరంగా ఉన్నారు.

ఇప్పుడు 2024లో ఏపీలో 2014 తరహా పొత్తులతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న పవన్..బీజేపీ నేతలను దగ్గర చేసుకొని తన వ్యూహం అమలు చేయటానికి ప్రచారంలో పాల్గొంటారా , లేక..ఇప్పటి లాగానే దూరంగా ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ నిర్ణయాలకు అనుగుణంగానే పవన్ 2024 ఎన్నికల్లో తన వైఖరిపైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+