బాబు దీక్షకు కర్నాటక తెలుగు సంఘాల మద్దతు: మోడీ ఇచ్చిన మట్టి, నీరు సముద్రంలో కలిపి నిరసన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు కర్నాటక తెలుగు వారు మద్దతు తెలిపారు. ఆయన దీక్షకు మద్దతుగా బెంగళూరులోని జిగిణీ పురసభలో ఉంటున్న తెలుగు ప్రజలు అమరావతికి వచ్చారు.

సోమవారం చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఆయన చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలిపేందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపిన వారు కర్ణాటక రాష్ట్ర పొట్టి శ్రీరాములు తెలుగు సంఘం నాయకులు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ పోరాటం ఎంతో ఉత్తమమైనది అన్నారు.

Karnataka Telugu Sangam supports Chandrababu Deeksha

హోదా కోసం సముద్రంలో నిరసన

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాకినాడలో టీడీపీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. నగర ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో జగన్నాధపురం జెట్టీ నుంచి సముద్రంలోకి 200 పడవలతో ప్రదర్శన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నీరు, మట్టిని సముద్రంలో కలిపి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కొండబాబు నల్లటి వస్త్రాలను ధరించి పడవల ప్రదర్శనలో పాల్గొన్నారు.

నగర కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు అధిక సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొని నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో చెలగాటం మోడీకి ఇరకాటం అని నినాదాలు చేశారు. గంటన్నరకు పైగా సముద్రంలో పడవల ప్రదర్శన కొనసాగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka Telugu Sangam supporting Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Deeksha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X