తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి, సోమవారం ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంచారామాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. శ్రీశైలం, మహానంది, యాగంటి, కాల్వబుగ్గ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు.












Click it and Unblock the Notifications